అలంపూర్: పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

1355చూసినవారు
అలంపూర్: పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం పచ్చర్లలో శనివారం సాయంత్రం పిచ్చికుక్క వీరంగం సృష్టించింది. వీధుల్లో తిరుగుతూ ఎదురొచ్చే వారిపై దాడి చేసి గాయపరిచింది. పిచ్చికుక్క దాడిలో బోయ మహదేవ్, కుమ్మరి కామేష్, తెలుగు రాజేశ్వరి గాయపడగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. దసరా సెలవుల నేపథ్యంలో ఇళ్ళకు వచ్చిన విద్యార్థులపై దాడి చేసే ప్రమాదం ఉందని గ్రామస్థులు అంటున్నారు. అధికారులు స్పందించి పిచ్చికుక్కను బంధించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :