ఫుడ్‌ పాయిజన్‌.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత!

6చూసినవారు
ఫుడ్‌ పాయిజన్‌.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత!
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతిగృహంలో కలుషిత ఆహారం తిన్న 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం అల్పాహారంలో పురుగులున్న ఉప్మా తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్