గద్వాల: ప్రభుత్వ హాస్టల్లో 50 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్

4చూసినవారు
గద్వాల: ప్రభుత్వ హాస్టల్లో 50 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం ప్రభుత్వ బీసి బాలుర పాఠశాలలో శుక్రవారం రాత్రి కలుషిత ఆహారం తిన్న 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తర్వాత కడుపునొప్పి, వాంతులతో బాధపడిన విద్యార్థులను వెంటనే జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బిఎం. సంతోష్, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :