బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ నాయకులు హర్షిస్తూ శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశం మేరకు మున్సిపల్ మాజీ ఛైర్మన్ బాబర్, బీసీ సంఘం నేతలతో కలిసి వైఎస్సార్ చౌరస్తాలో సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామన్ గౌడ్, కృష్ణ, సతీష్, తదితరులు పాల్గొన్నారు.