గద్వాల: సోమనాద్రి కాలువలో మొసలి కలకలం.!

3చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల సోమనాద్రి కాలువలో మొసలి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. బుధవారం గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద మొసలి కనిపించడంతో మహిళలు, పిల్లలు, పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం పశువులకు కాలువలోనే నీరు తాగిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు భయపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మొసలిని పట్టుకోవాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్