గద్వాల: ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రి పాలైన హాస్టల్ విద్యార్థులు

3చూసినవారు
జోగులాంబ గద్వాల నియోజకవర్గంలోని భీమ్ నగర్ ఎస్టీ హాస్టల్లో మంగళవారం ఉదయం 15 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యానికి గురయ్యారు. బూస్ట్ తాగిన తర్వాత ఉప్మాలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిని వెంటనే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని విద్యార్థులు తెలిపారు. ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్ మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. హాస్టళ్లలో విద్యార్థుల ఆహార నాణ్యతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్