గద్వాల: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

7చూసినవారు
గద్వాల: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
జోగులాంబ గద్వాల జిల్లా గోనుపాడు గ్రామ శివారులో బీటీ రోడ్డుపై ఎస్ఐ సిహెచ్ శ్రీకాంత్ వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ధరూరు గ్రామానికి చెందిన తెలుగు కృష్ణ, గద్వాల వైపు నుండి తన మినీ డీసీఎం వాహనంలో (నెంబర్-TG 33T0183) సుమారు 70 ప్లాస్టిక్ సంచులలో 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా రాయచూరుకు తరలిస్తుండగా పట్టుబడ్డాడు. వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్