గద్వాల: ఎన్నికల కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ

10చూసినవారు
గద్వాల: ఎన్నికల కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ
జోగులంబ గద్వాల జిల్లాలోని గద్వాల, గట్టు, కేటిదొడ్డి, ధరూర్ మండలాల్లో జరగనున్న మొదటి విడత ఎన్నికల కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని బుధవారం ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమి కూడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సభలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్ల వినియోగం, బైక్ ర్యాలీలు నిషేధమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :