గద్వాల: జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

73చూసినవారు
గద్వాల: జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 14 న జోగులాంబ గద్వాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత అన్నారు. గురువారం ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చన్నారు. రాజీ పద్ధతిలో క్రిమినల్, అన్ని రకాల సివిల్ కేసులు లోక్ అదాలత్ లో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్