జోగులంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 81 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. గురువారం ధరూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఆయన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతేడాది కంటే ఈసారి ప్రతి క్వింటాపై ప్రభుత్వం రూ. 49 అదనంగా చెల్లిస్తోందని, గత సీజన్ లో ఈ కేంద్రం నుంచి సుమారు లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.