జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలకల్లు స్టేజీ సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. రాజోలి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన మార్క్ (18), మరో 12 ఏళ్ల బాలుడు టమాటాలు విక్రయించడానికి శాంతినగర్ వెళ్తుండగా, జులేకల్-చంద్రశేఖర్ నగర్ మధ్య అంతర్రాష్ట్ర రహదారిపై ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆటోను ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.