గద్వాల: కోల్డ్ స్టోరేజ్ యజమాని అరాచకం

0చూసినవారు
గుంటూరులోని లీలా గాయత్రీ కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన 1,350 మిర్చి బస్తాలను యాజమాన్యం అక్రమంగా అమ్మేసుకుందని జోగులాంబ గద్వాల జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు. తమ మిర్చికి మంచి ధర వస్తుందనే ఆశతో నిల్వ చేసుకుంటే దోచుకున్నారని, తెలంగాణ సీఎం పేరు చెప్పి భయపెడుతున్నారని రైతులు సోమవారం కలెక్టర్, ఎస్పీకి వినతిపత్రం అందించారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్