జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ఓబులోంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుర్వ గోపి, జమ్ములమ్మ (36) దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు, విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఉదయం జరిగిన గొడవలో భర్త గోపి జమ్ములమ్మపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ధరూర్ ఎస్ఐ నందీకర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.