మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో జాతీయ రహదారి-44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కృష్ణారెడ్డి, తిక్కారెడ్డి మృతిచెందారు. వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురు రైతులకు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా, కోయిల్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు కృష్ణారెడ్డి, తిక్కారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. మరో సోదరుడిని హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.