గద్వాల: జూరాలను సందర్శించిన మాజీ మంత్రి

61చూసినవారు
గద్వాల: జూరాలను సందర్శించిన మాజీ మంత్రి
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ రాజకీయనేత, మాజీ మంత్రి డీకే. సమరసింహా రెడ్డి శనివారం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా కృష్ణానది వరద ఉద్ధృతి, క్రస్ట్ గేట్లను పరిశీలించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాజెక్ట్ నెలరోజుల ముందే జలకళ సంతరించుకుందని హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్