జోగులాంబ గద్వాల జిల్లాలో సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్లపై గందరగోళం నెలకొంది. ఈ నెల 23న ఆర్డిఓ నుంచి వెలువడిన జాబితాలో మానవపాడు మండలం చెన్నిపాడు సర్పంచ్ స్థానాన్ని జనరల్ కు కేటాయించగా, శుక్రవారం సెక్రటరీ సంధ్యారాణి నోటీసు బోర్డులో బీసీ జనరల్ అని అతికించారు. దీంతో నామినేషన్లకు సిద్ధమైన అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఎంపీడీఓ పంపిన జాబితానే అతికించానని సెక్రటరీ పేర్కొన్నారు.