గద్వాల: తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వండి

82చూసినవారు
గద్వాల: తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వండి
కేజీబీవీ పాఠశాలల్లో అనాధ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో కేజీబీవీ పాఠశాలలు, కళాశాలల నిర్వహణపై స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఆయా విద్యా సంస్థలలో విద్యార్థులకు మౌలిక వసతులు, బోధన వసతులను దృష్టిలో ఉంచుకొని అడ్మిషన్లు ఇవ్వాలన్నారు. అలాంటప్పుడే నాణ్యమైన బోధన అందుతుందన్నారు. అడ్మిషన్లు విద్యాశాఖ అధికారి అనుమతితో జరపాలని సూచించారు.

సంబంధిత పోస్ట్