జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మేజిక్ బస్ ఇండియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఈ ఉపాధి వేదికలో మొత్తం 140 మంది విద్యార్థినులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూలలో 40 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసాద్ విద్యార్థినులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని కెరీర్ లో స్థిరపడాలని ఆకాంక్షించారు.