జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి ఆంజనేయస్వామిని గురువారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తమ ఇంటి దైవంగా భావించి దర్శించుకున్నారు. ఆలయ నిర్వహకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి ప్రజల కష్టాలను తొలగించి చల్లగా చూడాలని కోరుకున్నట్టు ఎంపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.