జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మొసల్ దొడ్డి అటవీ ప్రాంతంలో ఈ నెల 4న జరిగిన తిమ్మప్ప హత్య కేసును పోలీసులు ఛేదించారు. శనివారం డీఎస్పీ మొగులయ్య మాట్లాడుతూ, బల్గెరకు చెందిన తిమ్మప్ప అన్న భార్యతో మిట్టదొడ్డికి చెందిన అబ్రహం అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, దీనికి తిమ్మప్ప అడ్డువస్తుండటంతో మద్యం తాగించి, రాయిలో కొట్టి చంపేశాడని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో సీఐ శ్రీను, ఎస్ఐ మల్లేష్ పాల్గొన్నారు.