జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలం పూడూరు గ్రామంలో నామినేషన్ల ప్రక్రియ శనివారం చివరి దశకు చేరుకుంది. ఏడు గ్రామాల సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే, ఇద్దరు అధికారులు ఒకే టేబుల్ వద్ద నామినేషన్లు స్వీకరించడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ రాత్రి 11 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది.