గద్వాల: 'సాంకేతికతను క్షేత్రస్థాయిలో అమలు చేయాలి'

62చూసినవారు
గద్వాల: 'సాంకేతికతను క్షేత్రస్థాయిలో అమలు చేయాలి'
లైసెన్స్డ్ సర్వేయర్లు నూతన సాంకేతికతను అభ్యసించి క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడే భూ సర్వేలు కచ్చితమైన ఫలితాలు వస్తాయని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పేర్కొన్నారు. సోమవారం గద్వాల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణలో పాల్గొన్నారు. భూభారతి చట్టం అమలుకుగాను రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తదితర ప్రక్రియల్లో తప్పనిసరిగా భూములు సర్వే చేసి మ్యాప్ జతపరచాల్సి ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్