గద్వాల: మద్యంమత్తులో ముగ్గురు యువకులు కత్తులతో పరస్పర దాడులు!

11చూసినవారు
గద్వాల: మద్యంమత్తులో ముగ్గురు యువకులు కత్తులతో పరస్పర దాడులు!
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ సమీపంలోని ఒక లాడ్జీలో సోమవారం రాత్రి మద్యం సేవించిన ముగ్గురు యువకులు, మంగళవారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు గాయాలవగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్