గద్వాల: హైవే-44పై మూడు వాహనాలు ఢీ... ఇద్దరికీ గాయాలు

21చూసినవారు
గద్వాల: హైవే-44పై మూడు వాహనాలు ఢీ... ఇద్దరికీ గాయాలు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండల పరిధిలోని జాతీయ రహదారి-44పై శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న కారును బోరవెల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనగా, దాని వెనుకనే మరో మినీ ట్రావెల్ బస్సు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :