జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుము, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో బంట్రోతు కుశలన్న అనే రైతుకు చెందిన రెండు కొడే దూడలు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. సుమారు రూ. 1,50,000/- విలువైన దూడలు మృతి చెందడంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందించాలని గ్రామ ప్రజలు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.