గద్వాల: సీఎం పర్యటనను అడ్డుకుంటాం: బీఆర్ఎస్ నేతల హెచ్చరిక

0చూసినవారు
గద్వాల: సీఎం పర్యటనను అడ్డుకుంటాం: బీఆర్ఎస్ నేతల హెచ్చరిక
జోగులాంబ గద్వాల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అభివృద్ధి కోసమే అయితే, గద్వాల నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం గద్వాల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు, కేశవ్ తదితరులు మాట్లాడుతూ, నియోజకవర్గంలో ర్యాలంపాడు, ఘట్టు ఎత్తిపోతల పథకం, నెట్టంపాడు ప్రాజెక్టు పెండింగ్ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్