గద్వాల: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

5చూసినవారు
గద్వాల: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం 2వ రైల్వే గేటు సమీపంలో ఓ గుర్తుతెలియని 28 ఏళ్ల మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే కానిస్టేబుల్ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్లే ఆమె కాచిగూడ-గుంటూరు రైలు కింద పడి ప్రాణాలు వదిలినట్లు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8341252529 నంబరుకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్