జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం నల్లకుంటలోని బావిలో ఈతకు వెళ్లి ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. బీసీ కాలనీకి చెందిన యువకుడు సరదాగా బావిలోకి దిగి, లోతును అంచనా వేయలేక ప్రమాదానికి గురయ్యాడు. సమాచారం అందుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింహులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికుల సహాయంతో యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి అకాల మరణం కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.