జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్జెస్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని అధికారులు తెలిపారు. హమాలీ కాలనీ, టీచర్స్ కాలనీ, హౌసింగ్ బోర్డు, జములమ్మ ఆలయ ప్రాంతం, జమ్మిచేడు పొలాలకు ఉదయం 9:00 నుంచి 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.