విహారయాత్రకు వస్తున్న విద్యార్థుల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

1926చూసినవారు
విహారయాత్రకు వస్తున్న విద్యార్థుల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
తమిళనాడు రాష్ట్రం సేలంలోని ఒక ప్రైవేటు పాఠశాలకు చెందిన 37 మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని వండర్లాకు ప్రైవేట్ బస్సులో విహారయాత్రకు వస్తుండగా, సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం బోరవెల్లి శివారులోని జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన విద్యార్థులను అలంపూర్ చౌరస్తాలోని 100 పడకల ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్