
గంటల వ్యవధిలోనే తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు మృతి
TG: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో తండ్రి మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే కుమారుడు మృతి చెందిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మార్డి గ్రామానికి చెందిన బొమ్మల పోచయ్య (60) కిడ్నీ సమస్యతో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన చిన్న కుమారుడు బొమ్మల రాజు (36) పక్షవాతంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తండ్రి మరణవార్త విని తల్లడిల్లిన రాజు.. ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. తండ్రీకొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు.




