జడ్చర్లలో 305 గ్రాముల గంజాయి పట్టివేత.!

4చూసినవారు
జడ్చర్లలో 305 గ్రాముల గంజాయి పట్టివేత.!
జడ్చర్ల శివారులో ఎక్సెజ్ అధికారులు తనిఖీలు నిర్వహించగా, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రవిదాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 305 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, అతను జార్ఖండ్ నుండి గంజాయిని తెచ్చి గ్రాము రూ. 500 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు ఎక్సెజ్ సీఐ విప్లవ్ రెడ్డి తెలిపారు. గంజాయి వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :