జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పద్మావతి కాలనీలో గల అక్షర కాన్సెప్ట్ హైస్కూల్లో శ్రీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నిమజ్జన శోభాయాత్రను కంటిపాపలా, కోలాహలంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపులో విద్యార్థినీ
విద్యార్థులు సాంప్రదాయ హిందూ వస్త్రధారణలో మెరిసిపోయారు.
విద్యార్థులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు, భక్తి పాటల విన్యాసాలు చూపరులను, స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కరస్పాండెంట్ రేణుక జగదీష్, ప్రిన్సిపాల్ నయుముద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.