మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని దేవుని గుట్ట తండాలో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కే కవిత కిషన్ నాయక్ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంచాయితీలోని 8 వార్డు సభ్యులు కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అభినందించారు. గ్రామ అభివృద్ధికి పాటుపడతామని వారు పేర్కొన్నారు.