జడ్చర్ల ఓవర్ బ్రిడ్జి కింద బుధవారం జరిగిన బైక్ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. సంఘటనా స్థలం నుంచి వెళ్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి వెంటనే స్పందించి, గాయపడిన వారిని తన కాన్వాయ్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు సకాలంలో వైద్యం అందేలా డాక్టర్లతో మాట్లాడి, చికిత్సను స్వయంగా పర్యవేక్షించి ఎమ్మెల్యే మానవత్వాన్ని చాటుకున్నారు.