మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల పరిధిలోని మల్లాపూర్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడు ఏడు రోజులపాటు పూజలందుకున్నాడు. ఆదివారం రోజున డప్పు చప్పట్లు, భజనలు, కోలాటాలు, బతుకమ్మ, ఆటపాటలతో గణనాధుడిని ఊరేగించి, అనంతరం అన్నదానం, వేలంపాట కార్యక్రమాలు నిర్వహించి గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.