మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన.. బాధ్యులు సస్పెన్షన్

14చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ నాగసాలకు చెందిన భీమేశ్ మృతదేహాన్ని సోమవారం కుక్కలు పీక్కుతిన్న ఘటనపై రాష్ట్ర వైద్య విధాన ఆరోగ్య పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ మంగళవారం తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రిని సందర్శించి విచారణ చేపట్టిన ఆయన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్ చంద్రకళ, పోస్టుమార్టం చేసిన డాక్టర్, వార్డు బాయ్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్