జడ్చర్ల: 13 రక్తపింజర్లు పట్టివేత: ప్రొఫెసర్ సదాశివయ్య

1367చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో గత నెల రోజుల్లో 13 రక్త పింజర్లును పట్టుకున్నట్లు సర్పరక్షకుడు డా. సదాశివయ్య ఆదివారం తెలిపారు. నవంబర్-డిసెంబర్ నెలల్లో ప్రత్యుత్పత్తి కాలం కావడంతో ఇవి ఎక్కువగా కనిపిస్తాయని, రాత్రిపూట సంచరించే ఈ పాములు 5 నెలల తర్వాత 30-40 పిల్లలను కంటాయని ఆయన వివరించారు. ప్రజలు ఈ పాములతో జాగ్రత్తగా ఉండాలని, కనిపిస్తే 9963536233 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. రైతులు రాత్రివేళ పొలాల్లో తిరిగేటప్పుడు వదులుగా ఉండే దుస్తులు ధరించి, టార్చ్ లైట్ తప్పనిసరిగా వాడాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్