జడ్చర్ల: గల్లంతైన రెండో వ్యక్తి మృతదేహం లభ్యం

69చూసినవారు
జడ్చర్ల: గల్లంతైన రెండో వ్యక్తి మృతదేహం లభ్యం
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని గంగాధర్ పల్లి గ్రామశివారులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటన సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఎస్ఐ లెనిన్ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాలలో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందితో గాలింపు చేపట్టారు. మంగళవారం సాయంత్రం శివరాములు మృతదేహం లభ్యం కాగా, బుధవారం ఉదయం యాదయ్య(25) మృతదేహం లభ్యమయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్