జడ్చర్ల: పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ అధ్యక్షుడి హాల్ చల్

1285చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో భూత్ పూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గురువారం పోలీసులతో వాగ్వాదానికి దిగి, రైటర్ కాలర్ పట్టుకుని రచ్చ చేశారు. రోడ్డు ప్రమాదంపై మాట్లాడేందుకు వచ్చిన ఆయన, పోలీసుల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.