జడ్చర్ల: మొక్కజొన్న పంట దగ్ధం.. రైతుల ఆవేదన

1చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో సోమవారం ప్రమాదవశాత్తు ఆరు ఎకరాల మొక్కజొన్న పంట కాలి బూడిదైంది. కోత దశలో ఉన్న పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతులు కుమ్మరి రాములు, నాగేశ్, రవి కన్నీరుమున్నీరు అవుతున్నారు. రూ. లక్షల నష్టం వాటిల్లిందని, అప్పులు చేసి సాగు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన తమను ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :