మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి-44వ సర్వీస్ రోడ్డులో బుధవారం ఉదయం సాంకేతిక లోపంతో ఓ డీసీఎం వాహనం రోడ్డుపైనే నిలిచిపోయింది. జడ్చర్ల నుంచి హైదరాబాద్ వెళుతుండగా గేర్ బాక్స్ లో సమస్య రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో సర్వీస్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఉదయం పూట కావడంతో మెకానిక్ షాపులు తెరవకపోవడంతో డ్రైవర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.