మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మృతదేహం కుక్కల పాలైంది. నాగసాలకు చెందిన భీమేష్ అనే వ్యక్తి మృతిచెందగా, పోస్టుమార్టం కోసం తరలించిన మృతదేహాన్ని మార్చురీలో సరైన భద్రత లేకపోవడంతో సోమవారం కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన కుటుంబసభ్యులు, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.