మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం బోయినపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ లో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా నీరు చేరింది. భవిష్యత్తులో ఇలా జరిగితే ప్రమాదకరమని, నీరు రాకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని స్థానికులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు.