నల్గొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గొర్రెల వ్యాపారి ఎల్లయ్య మృతి చెందాడు. గొర్రెల లోడుతో జడ్చర్ల వైపు వెళ్తున్న మూడు డీసీఎంలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వాహనంపై కూర్చున్న నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఎల్లయ్య అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం, ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.