జడ్చర్ల ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఓ వ్యక్తి శవాన్ని కుక్క పీక్కుతినడంపై ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై విచారణ అనంతరం, ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్‌ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్, ఎంఎన్‌వోలను సస్పెండ్ చేసింది. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు జడ్చర్ల పాత ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి, ఘటనపై విచారణ చేపట్టారు.