జడ్చర్ల: ఆస్పత్రి సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ వేటు

1చూసినవారు
జడ్చర్ల: ఆస్పత్రి సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ వేటు
జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో శవాన్ని పోస్టుమార్టం కోసం ఉంచగా, కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, మంగళవారం నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంఓ హరినాథ్, ఎంఎఓ రవి ప్రకాష్, డ్యూటీ డాక్టర్ మునిషాలను సస్పెండ్ చేసినట్లు హెల్త్ అండ్ ఫ్యామిలీ కమిషనర్ అజయ్ తెలిపారు. నిర్లక్ష్యం వహించిన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్