జడ్చర్ల: భారీ వర్షానికి కూలిన ఇల్లు.. తప్పిన ప్రమాదం

585చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ లో నివాసముంటున్న సౌరమ్మ ఇల్లు గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది. ఇల్లు కూలిపోయే సమయంలో అందులోని మహిళ, పిల్లలు బయటకు రావడంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రభుత్వం అధికారులు, ఎమ్మెల్యే స్పందించి ఆదుకోవాలని బాధితురాలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్