జడ్చర్ల: బ్రిడ్జిపై ఆగిపోయిన లారీ.. భారీగా ట్రాఫిక్ జామ్

4చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని సింగిల్ గడ్డ బ్రిడ్జిపై గురువారం ఉదయం లారీ ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు క్రేన్ సహాయంతో లారీని పక్కకు తప్పించి, ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఓవర్ లోడ్ కారణంగా లారీ ఎక్సెల్ విరిగిపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్