మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన కాగుల కేశవులు యాదవ్ (40) ఆదివారం తన ఇంటి వద్ద ఉన్న నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. మృతుని భార్య కాగుల యశోద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.